రైల్వే స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం కేసులో నిందితుని పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సాయి రెడ్డి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.
ఆదివారం అర్ధరాత్రి సుమారు మూడు గంటల సమయంలో కృష్ణ ఎక్స్ప్రెస్ లో హైదరాబాదులో నొప్పులకు చెందిన మహమ్మద్ సలీం అనే వ్యక్తి అతని భార్యతో కలిసి వెళుతున్నారు.
వారు నిద్రిస్తున్న సమయంలో నిజామాబాద్ కు చెందిన సునీల్ అనే వ్యక్తి వారి వద్ద నుంచి హాండ్ బ్యాగును దొంగలించాడు. లేచి చూసేసరికి అంటే ఆ వ్యక్తి పారాలైనట్లు పేర్కొన్నారు.
దీంతో బాధితులు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారించగా అతని వద్ద స్వాధీనం చేసుకున్నారు.
అందులో ఏడు తులాల వెండి, కొంత బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఎక్కడివని ఆరా తీయగా నిందితుడు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి రెడ్డి పేర్కొన్నారు.