నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తండ్రి, కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. ఫజల్‌ఖాన్, ఆయన కుమారుడు షాదుల్‌ఖాన్ మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యారు.
ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇద్దరూ గాయపడినట్లు తెలిసింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వారిని మంటల నుంచి బయటకు తీసుకొచ్చారు.
అనంతరం చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఇద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
