Monday, April 27, 2026
HomeTelanganaNizamabadహోరాహోరీగా మున్సిపల్ పోరు..మధ్యాహ్నం 3 గంటల వరకు 48.55 శాతం నమోదు..

హోరాహోరీగా మున్సిపల్ పోరు..మధ్యాహ్నం 3 గంటల వరకు 48.55 శాతం నమోదు..

పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు.. మరికాసేపట్లో ముగియనున్న సమయం.. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపడంతో పోలింగ్ కేంద్రాలు కళకళలాడుతున్నాయి.

జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ చెదురుమొదురు సంఘటనలు మినహా అత్యంత ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి సగటున 48.55 శాతం ఓటింగ్ నమోదైంది. పట్టణ ప్రాంతాల కంటే మున్సిపాలిటీల్లో ఓటర్లు అధికంగా తరలివస్తుండటం గమనార్హం.

నిజామాబాద్ కార్పొరేషన్: 43.18% * ఆర్మూర్: 60.07% * బోధన్: 61.77% * భీమ్గల్: 63.65% ఓటింగ్ శాతం నమోదైంది. పోలింగ్ ముగియడానికి కేవలం ఒక్క గంట సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో ఓటర్లు బారులు తీరడంతో కేంద్రాల వద్ద కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.

తమ వంతు కోసం ఓటర్లు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. సమయం ముగిసే లోపు క్యూ లైన్‌లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్దే ఉండి ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!