ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు. జగిత్యాల్ జిల్లాలో ఆమె ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ధరూర్ బైపాస్ చేరుకున్న ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు భారీఎత్తున క్యాడర్ కదిలి వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లారు. అయినప్పటికీ భారీఎత్తున క్యాడర్ తరలి రావడం గమనార్హం.గజమాలతో స్వాగతం పలికారు.
ఆమె ఎప్పటిలాగే మహిళలతో కలిసి బతుకమ్మఆడి ఉత్సాహపరిచారు.బెయిల్ మీద జైలు నుంచి బయటికి వచ్చాక ఆమె మొదటి సారిగా ప్రజల్లోకి వచ్చారు.గతంలో ఎంపి గా తాను ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ నియోజకవర్గ పరిధి లోకి వచ్చే జగిత్యాల్ జిల్లా ఆమె కు మొదటి నుంచి కంచుకోటగా ఉంది.
అందుకే అక్కడి నుంచి మరోసారి ఎంట్రీ ఇచ్చారు ఎమ్మెల్సీ గా ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లా నుంచి ఆమె రీఎంట్రీ ఇస్తారని అంతా భావించారు.కెసిఆర్ దీక్షా దివాస్ వేదిక ఆమె పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షలో పాల్గొనడానికి రంగంసిద్దం చేసుకున్నారు ఈ మేరకు జాగృతి ప్రతినిధులు సైతం మూడు రోజుల ముందే జిల్లాకు వచ్చి కవిత రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
ఆమె కూడా పార్టీలో గతంలో క్రియాశీలకంగా పనిచేసి డి యాక్టివ్ అయిన కొంత మంది యువనేతలతో నేరుగా మాట్లాడి మరోసారి క్రియాశీలం కావాలని పురమాయించారు. మరో వైపు క్యాడర్ లోనూ కవిత రాక కొత్త జోష్ తెచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరవాత ఓడిన ఎమ్మెల్యే లు నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడం లేదు.
అధికార పార్టీ నేతల దాష్టికాలఫై నోరెత్తడం లేదు. దీనితో క్యాడర్ సైలెంట్ అయ్యారు. లోకల్ బాడీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో డీలా పడ్డ పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపే దిశగా కవిత టూర్ ఉండేలా ఆమె టీం కార్యాచరణ తయారు చేసింది. మరో వైపు మాజీ ఎమ్మెల్యే ల్లోనూ మరోసారి కవిత తాలూకు వణుకు మాత్రం స్పష్టంగా వ్యక్తం అయింది కానీ అదేరోజు ఆమె లిక్కర్ కేసులో వర్చువల్ గా హాజరు కావాల్సి ఉండే దీనితో చివరిలో నిజామాబాద్ టూర్ రద్దు అయింది దీనితో గులాబీ శ్రేణులు ఒక్కసారిగా డీలా పడ్డాయి.
లోకసభ ఎన్నికల పక్రియ కు ముందే ఆమె ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు కు వెళ్లారు అయిదు నెలల పాటు ఆమె జైలు లోనే ఉన్నారు. బెయిల్ మీద రిలీజ్ అయ్యాక దాదాపు మూడు మాసాలు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. పార్టీ నేతలెవ్వరితోనూ టచ్ లోకి రాలేక పోయారు .
కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెరమరుగైన జాగృతి వేదిక ను మరోసారి యాక్టివ్ చేసి అదే వేదిక బిసి నినాదం తోనే ఆమె క్రియా శీల రాజకీయాలకు తెరలేపారు. ఆదివారం నుంచి ప్రజాక్షేత్రంలోకి ఎంట్రీ ఇచ్చారు.
అయితే జగిత్యాల్ సెగ్మెంట్ లోనే అడుగు పెట్టడం వెనుక అధినేత వ్యూహంగా చెప్తున్నారు. ఆ క్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ లో వెళ్లిన నేపథ్యంలో పార్టీ క్యాడర్ కు భరోసా ఇవ్వాలంటే బలమైన నేత రంగంలోకి దిగాలనేది కెసిఆర్ ఆలోచన గా చెప్తున్నారు. గతంలోఓ సారి కేటీఆర్ వెళ్ళి పార్టీ క్యాడర్ తో భేటీ అయ్యారు. కొనసాగింపుగానే కవిత ను రంగంలోకి దిగారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి
