HomeCRIMEఅయిదు రాష్ట్రాల కు చెందిన ఎనిమిది మంది తో ఉన్న దొంగ నోట్ల ముఠా ను...

అయిదు రాష్ట్రాల కు చెందిన ఎనిమిది మంది తో ఉన్న దొంగ నోట్ల ముఠా ను కామారెడ్డి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు..

అయిదు రాష్ట్రాల కు చెందిన ఎనిమిది మంది తో ఉన్న దొంగ నోట్ల ముఠా ను కామారెడ్డి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ 57 లక్షల విలువ గల 500 ల నకిలీ నోట్లను ప్రింటర్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు.

కొలవరి కిరణ్ కుమార్ రాజగోపాల్ రమేష్ గౌడ్ లు ముగ్గురు కారు లో వెళ్తుండగా బాన్స్ వాడ శివారు లో కొయ్యగుట్ట వద్ద అనుమానం వచ్చి కారు తనిఖీ చేయగా వారివద్ద రూ 30 లక్షల నకిలీ నోట్లు లభ్యం అయ్యాయని వారిని విచారించడంతో ఈ ముఠా గుట్టు రట్టు అయిందని సింధు శర్మ పేర్కొన్నారు.

అయిదు రాష్ట్రాలకు చెందిన మూడు ముఠాలు ఇందులో భాగస్వామ్యం వుందని ఆమె చెప్పారు ఒక్కో ముఠా ఒక్కో బాధ్యత తీసుకోని పక్క ప్రణాళిక తో దొంగ నోట్ల తయారీ చెలామణి చేసారని ఆమె వివరించారు తెలగాంణ కు చెందిన రాజగోపాల్ కర్నాటక కు చెందిన హుస్సేన్ పీరా లు కలిసి ఈ దందా చేయడానికి సిద్ధం అయ్యారని పెట్టుబడి పెట్టడానికి సైతం ముందుకు వచ్చారు.

రాజస్థాన్ కు చెందిన కమలేష్ సుక్రామ్ ఉత్తరాఖండ్ కు చెందిన రాధాకృష్ణ లు దొంగనోట్లు ఎలా తయారు చేయాలో యూట్యూబ్ ల్లో చూసి నేర్చుకున్నారు. వీరంతా కలిసి గౌ లి గూడ లో దొంగ నోట్ల తయారీ అవసరమైన ప్రింటర్ స్కానర్ కంప్యూటర్ లను కొనుగోలు చేసారు.

బోయిన్ పల్లి లో ఎవరికీ అనుమానం రాకుండా అంటిలియా అపార్టుమెంట్ లో పెంట్ హౌస్ ను నెలకు లక్ష రూపాయల అద్దె తీసుకున్నారు అక్కడే ఎవరికి అనుమానం రాకుండా దొంగ నోట్ల తయారు చేశారు.

500 నోట్ల ను సుమారు 60 లక్షల మేరకు తయారు చేసారు తయారు అయిన నోట్ల ను గ్రామీణ ప్రాంతాల్లో చెలామణి చేసే బాధ్యత ను బిచ్కుంద కు చెందిన కిరణ్ బాన్స్ వాడ కు చెందిన రమేష్ మహారాష్ట్ర కు చెందిన అజేయ్ ఈశ్వర్ లకు అప్పగించారు ఈ మేరకు వారు ముగ్గురు కలసి మూడు లక్షల రూపాయలను ఆయా ప్రాంతాల్లో చెలామణి చేసారు.

దీనితో వీరికి మరో 30 లక్షల దొంగ నోట్లు అప్పగించారని వాటిని హైదారాబాద్ నుంచి కారు తీసుకొస్తుండగానే బాన్స్ వద్ద పట్టుకున్నామని వారిచ్చిన సమాచారం మేరకు బోయిన్ పల్లి లో అపార్టుమెంట్ మీద దాడి చేసి మిగితా దొంగ నోట్లు ప్రింటర్ స్కానర్ కంప్యూటర్ లను స్వాధీనం చేసుకొని మరో ముగ్గరిని పట్టుకున్నామని ఇద్దరు ఇంకా పరారీ లో ఉన్నారని ఆమె వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments