నగరంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి సమయంలో సుభాష్ నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.అప్పటికే కార్యలయంలో కంప్యూటర్లు,ఫర్నిచర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
