HomeCRIMEదుమారం రేపిన ఫ్లెక్సీ పంచాయితీ --పంచాయతీ సిబ్బంది ఫ్లెక్సీలు తొలగింపు ఫై రగడ ......ఆందోళన...

దుమారం రేపిన ఫ్లెక్సీ పంచాయితీ –పంచాయతీ సిబ్బంది ఫ్లెక్సీలు తొలగింపు ఫై రగడ ……ఆందోళన కారులను ఈడ్చుకెళ్ళిన పోలీసులు —-ఐదు గంటలపాటు దళిత సంఘాల ధర్నా ,రాస్తారోకో –బాన్సువాడ డి.ఎస్.పి సత్యనారాయణ హామీతో ఆందోళన విరమణఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత

అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. వాటిని పంచాయితీ సిబ్బంది తొలగించడం రచ్చకు దారి తీసింది.

స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేక పోవడంతో ఉదయం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ల్లో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడం తో రగిలి పోయారు. ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్, ఎమ్మెల్సీ కవిత ఫోటోలు ముద్రించి ఉన్నాయి.

ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఫోటో లేకపోవడం ఫై నిరసన వ్యక్తం చేశారు. వెంటనే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని కార్యదర్శి శ్రావణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

ఆయన విగ్రహం వద్దకు వెళ్లి ఫ్లెక్సీలను తొలగించాలని అంబేద్కర్ సంఘం నాయకులకు సూచించారు. నిబంధనల ప్రకారం అంబేద్కర్ విగ్రహానికి 50 ఫీట్ల దూరంలో ఏలాంటి ఫ్లెక్సీలు ఉండదని సూచించారు.

తాము పార్టీలకు అతీతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు దాంతో కార్యదర్శి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లింగంపేట ఎస్సై వెంకట్రావు తన సిబ్బందితో వచ్చి ఫ్లెక్సీలు తొలగించాలని సూచించారు.

తాము ఫ్లెక్సీలను తొలగించం అందులో అంబేద్కర్ సంఘం నాయకులు ఉన్నారని చెప్పారు. ఫ్లెక్సీ వివాదం వదలడంతో ఎస్ఐ ఎల్లారెడ్డి సిఐ కి సమాచారం అందించారు. ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ తన సిబ్బందితో లింగంపేట అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు.

దళిత సంఘాల నాయకులు ఫ్లెక్సీ తొలగించాలని నచ్చ చెప్పారు అయినా వారు ఫ్లెక్సీలు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు తమ ఫ్లెక్సీలు తొలగిస్తే పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు సైతం తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సీఐ గ్రామపంచాయతీ సిబ్బందికి ఫ్లెక్సీలు తొలగించాలని సూచించారు.

గ్రామపంచాయతీ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించి ట్రాక్టర్లు తరలిస్తుండగా సీఐతో దళిత నాయకులు వాగ్వాదానికి దిగారు. పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తీయాలని డిమాండ్ చేశారు. దాంతో సీఐ వాటిని తొలగించను ఏం చేసుకుంటారో చేసుకోండి ధర్నాలు చేస్తారా చేయండి అంటూ దురుసుగా అసభ్యపదయాలంతో దూషించారు.

సీఐ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండల అంబేద్కర్ సంఘ గౌరవ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ ముదాం సాయిలు దళిత సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేపట్టి రోడ్డుపై బైఠాయించారు.

ఈ క్రమంలో ఎల్లారెడ్డి సిఐ మహిళా పోలీసులు తన సిబ్బందితో అంబేద్కర్ సంఘం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ ఎంపీపీ ముదాం సాయిలు ను అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఆయన చొక్కా చినిగిపోయి, పాయింటు ఊడిపోయింది.

అర్ధ నగ్నంగా స్థాయిలను పోలీసులు లాక్కెళ్లి పోలీస్ వాహనంలో పడేశారుదాంతో దళిత సంఘాల నాయకులు దౌర్జన్యంగా దళిత నాయకులను అరెస్టు చేడాన్ని నిరసిస్తూ. ఇతర మండలాల అంబేద్కర్ సంఘం నాయకులకు సమాచారం అందించడంతో వందల సంఖ్యలో దళిత సంఘ నాయకులు, జిల్లా మండల నాయకులు లింగంపేట మండల కేంద్రానికి చేరుకొని భారీ సంఖ్యలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ సంఘం నాయకులకు స్థానిక బి ఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ లింగంపేట్ కు చేరుకుని కామారెడ్డి ఎల్లారెడ్డి చౌరస్తాలో బయటాయించారు. దళితులను అవమానించిన సీఐ రవీందర్ నాయక్ క్షమాపణ చెప్పాలని, ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చేశారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్ గాంధారి తాడువాయి ఎస్సైలు తమ సిబ్బందితో అంబేద్కర్ చౌరస్తా చేరుకొని అలాగే కామారెడ్డి సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్సై సిబ్బంది ప్రత్యేక బలగాలతో లింగంపేట్ చేరుకున్నారు.

అలాగే బాన్స్వాడ డి.ఎస్.పి సత్యనారాయణ లింగంపేట్ చేరుకొని. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో చర్చలు జరిపారు, ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ వెంటనే పోలీసులు అరెస్టు చేసిన దళిత నాయకులను బేషరత్తుగా వదిలేయాలని డిమాండ్ చేశారు. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు ఆయన జయంతిని దళిత సంఘాలు పండగల జరుపుకుంటాయి అన్నారు.

అలాంటి వ్యక్తి జయంతిని జరుపుకోకుండా చేసే అవమానపరిచిన సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో డిఎస్పీ మాట్లాడుతూ అరెస్టు చేసిన వారిని వదిలేసి ఎలాంటి కేసులు పెట్టమని చెప్పారు.

ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ పై దళిత సంఘాల నాయకులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆయనపై చర్యలు తీసుకుంటానని, పై అధికారులకు నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. అరెస్టు చేసిన ముదాం సాయిలు భూపతి తో పాటు మరో ఇద్దరిని అంబేద్కర్ చౌరస్తా కు తీసుకొచ్చారు.

అనంతరం మాజీ ఎంపీపీ భుదాం సాయిలు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ దళిత సంఘాల నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాంతో దళిత సంఘాల నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఆందోళన విరమించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments