భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ధన్ పాల్ లక్ష్మిభాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలో మజ్జిక పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా ట్రస్ట్ బాధ్యులు ధన్ పాల్ ప్రణయ్ కుమార్ గారు మాట్లాడుతు సమాజంలో అందరికి సమానంగా స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కులను రాజ్యాంగం అనే పవిత్ర గ్రంధం ధ్వరా ప్రజలందరికి హక్కులను కల్పించిన మహనీయులు డా. బీఆర్ అంబేద్కర్ గారు అని కొనియాడారు.
డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కులతోనే నేడు సమాజంలో ప్రజలు కుల, మత, లింగ వివక్షత లేకుండా రాజకీయంగా, సామజికంగా, ఆర్ధికంగా ఉన్నత శిఖరాలను అవరోదిస్తున్నారని అన్నారు.మహనీయుల జయంతిలు, వర్ధంతులు జరుపడానికే పరిమితం కాకుండా నేటి యువతరం అంబేద్కర్ ఆశయసాధనకు, వారి ఆకాంక్షలకు అనుకుంగా పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.