డంపింగ్ యార్డు నుంచి వచ్చే పొగ,దుర్వాసన ప్రభావం వల్ల నాగారం లోని సుమారు 45 మంది ఆదివారం రాత్రి అస్వస్థత కు గురయ్యారు. వీరిని హుటాహుటిన అంబులెన్స్ లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కాలనీ వాసులు తెలిపారు.
నిజామాబాద్ కూతవేటు దూరంలో ఉన్న నాగారం డంపింగ్ యార్డ్ కారణంగా ఆదివారం రాత్రి కాలనీలోని పలువురు ఉన్నట్టుంది ఒక్క సరిగా కుప్పకూలారు. వీరందరూ శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది అయ్యారు.
అలాగే కొందరు కళ్లు తిరిగి పడిపోవడం జరిగింది. వీరందరినీ స్ధానిక అంబులెన్స్ సిబ్బంది ద్వారా హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు.వారు మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో సేకరించిన చెత్తను శుద్ధి చేయకుండా డంపింగ్ యార్డ్లో పారబోస్తున్నారు.
అటువైపుగా వెళ్తే.. భరించలేని దుర్వాసన ముక్కుపుటాలను అదిలిస్తోందనీ వారు ఆవేదన వ్యక్తంచేశారు.నగరంలోని చెత్తతో తమ బతుకులు బలి చేస్తారా? అని ప్రశ్నించారు.
డంపింగ్ యార్డు కు అగ్ని ప్రమాదం కారణంగా ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నంలో చెత్త తడిసి తడిగా మారటం వలన దుర్గంధ్దం మరింత ఏక్కువవుతుందని అన్నారు.
మునిసిపల్ కమిషనర్ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కాలోనివాసులు తెలియజేశారు.