తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 48వ జన్మదిన వేడుకలు శుక్రవారం ఆమె కార్యాలయంలో వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా జాగృతి శ్రేణులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు శంకర్ మాట్లాడుతూ..
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతిని స్థాపించి, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు కవితక్క జీవం పోశారని కొనియాడారు. “తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాల పండుగలను విశ్వవ్యాప్తం చేయడంలో ఆమె పోషించిన పాత్ర చిరస్మరణీయం.
రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ ఆమె తనదైన ముద్ర వేశారు” అని పేర్కొన్నారు.మరో నాయకురాలు అవంతి మాట్లాడుతూ.. కవిత గారు కేవలం సాంస్కృతిక రంగానికే పరిమితం కాకుండా, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు.
“కరోనా విపత్తు సమయంలో కోవిడ్ రోగులకు ప్రాణవాయువులా అండగా నిలిచారు. అలాగే తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించిన ఘనత ఆమెకే దక్కుతుంది” అని ప్రశంసించారు.
ఈ వేడుకల్లో డి. ప్రవీణ్ కుమార్, హనుమగిరి, గట్టు హరికృష్ణ, కుల్దీప్, పంచ రెడ్డి, మురళి శంకర్, శ్రీనివాస్ గౌడ్, రేఖ, సరిత, శ్రీకాంత్ నాయక్ సహా పెద్ద సంఖ్యలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
