డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురికి జైలు శిక్షా 13 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే..
మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 17 మందికి ట్రాఫిక్ ఏసిపి టి నారాయణ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ బుదవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందు హాజరుపరచగా 13 మందికి 14,500/- జరిమాన విధించినట్లు తెలిపారు.
అలాగే సిహెచ్ భాస్కర్, తోట బాలయ్య, గావల్వాడ్ సురేష్, కాలగడ్డ ప్రవీణ్ వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
