జిల్లా కోర్టు ఆవరణలో పంజాబ్ నేషనల్ బ్యాంకు గుర్భబాది బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం ఒక రోజు శిబిరం మేనేజర్ మాధవిలత ఆధ్వర్యంలో నిర్వహిoచారు.
జిల్లా జడ్జి గారైన శ్రీమతి కుంచాల సునీత ముఖ్య అతిథి గా హాజరై ఈ శిబిరం చాలా మందికి ఉపయోగపడుతుందని జీరో బ్యాలన్స్ అకౌంట్ వల్ల డబ్బులు ఆదా చేయవచ్చని, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి ఉపయుక్తంగా ఉంటుందని తెలియచేసారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది రావులపల్లి జగదీశ్వర్ రావు మరియు ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు కక్షిదారులు పాల్గొని విజయవంతం చేసారు.
రేపు కూడా ఈ శిబిరం ఉంటుందని తర్వాత తమ బ్రాంచిలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని శ్రీమతి మాధవి లత గారు తెలిపారు.
