నిజామాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆద్వర్యంలో అధికారులు,సిబ్బంది బుధవారం మధ్యాహ్నం నుంచి తనిఖీలు చేపడుతోంది.
ప్రధాన గేటుకు తాళం వేసేసి సోదాలు చేపడుతున్నారు. సోదాల నేపథ్యంలో కార్యాలయం వెలుపల గల ఏజెంట్ల దుకాణాలు మూసివేశారు. వాహనాలకు సంబంధించిన పనుల నిమిత్తం కార్యాలయానికి వెళ్తే నేరుగా పనులు జరగడంలేదని, మధ్యవర్తులుగా బ్రోకర్లు వ్యవహరిస్తూ డబ్బులు దండుకుంటున్నారని వచ్చిన ఆరోపణలపై ఏసీబీ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
దాదాపు కొన్ని గంటలపాటు ఆర్టీవో కార్యాలయంలో సోదాలు జరిగాయి. కార్యాలయం లోపల ఉన్న ఏజెంట్లతోపాటు సిబ్బందిని సైతం తనిఖీ చేస్తూ విచారణ నిర్వహిస్తున్నారు. ఇటీవలే నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ దాడులు నిర్వహించి సబ్ రిజిస్టర్ తో పాటు అటెండర్ ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోదాలు చేసిన వారం రోజులు తిరగకముందే ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు జరపండం జిల్లాలో చర్చనీయాంశమైంది.
