HomeLaw and Orderసమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్లేందుకే ఫ్రీ సమ్మర్ క్యాంపు - ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న...

సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్లేందుకే ఫ్రీ సమ్మర్ క్యాంపు – ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న పోలీస్ కమిషనర్

సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్లేందుకే ఫ్రీ నమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., గారు తెలిపారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., గారి ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి మే 2 వరకు ( వారం రోజుల పాటు) నిర్వహించే ఆర్మూర్ రోడ్డులోని ఆర్.బి.వి.ఆర్.ఆర్ స్కూల్ లో ఈ ఫ్రీ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు శుక్రవారం ఫ్రీ సమ్మర్ క్యాంపును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ పాఠశాలలోని చదువులకు సమ్మర్ క్యాంపు లకు చాలా తేడాగా ఉంటుందని, ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థినీల ఎలా ఉండాలి, ఎలా చదువు కోవాలి, ఎలా భవిష్యత్తులో ముందుకు వెళ్లాలి, ఏదైనా సమస్యలు ఉంటే ఎలా ఎదుర్కోవాలి అనే ప్రతి ఒక్క అంశంపై క్లుప్తంగా ఈ క్యాంపులో వివరించడం జరుగుతుందని తెలిపారు.

విద్యార్థులకు ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ ఆత్మస్థైర్యం పెంపొందించడం నేరాల పట్ల అవగాహన కల్పించడం శిబిరంలో వారు తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను, దైర్యాన్ని ఎలా పొందాలనే దానిపై శిక్షణ పొందుతారు.

శిబిరం విధ్యార్థులలో ఆత్మసైర్యాన్ని పెంచుతుంది. వారు సమాజంలో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో జీవించగలరు. శిబిరంలో విధ్యార్థులకు నేరాల నుండి ఎలా దూరంగా ఉండాలో వాటిని ఎలా ఎదుర్కోవచ్చో నేర్చుకుంటారు అని తెలియజేశారు.

శిబిరంలో, మహిళలపై జరిగే నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వారు నేరాల నుండి తమను తాము ఎలా రక్షించుకోవచ్చో, ఆత్మసైర్యంతో ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు.

శిబిరంలో విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిచుకునేందుకు సెల్ఫ్ మోటివేషన్ ( ప్రేరణ ) తరగతులు ఉంటాయని ఈ సందర్భంగా హాజరైన ప్రతి విద్యార్థినిలకు కృతజ్ఞతలు తెలియజేస్తు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

మొదట ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు తైక్వాండో టైలర్ మనోజ్ ఆధ్వర్యంలో విద్యార్థినీలకు శిక్షణ ఇచ్చారు. ఆడపిల్లల పై అఘాయిత్యాలకు, ఈవ్ టీచింగ్లు, లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న నేపద్యంలో విద్యార్ధినులు తమ తను తాము రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణ) ఎలా చేసుకోవాలో ఒక్కోక్కటి స్టెప్ బై స్టెప్ విద్యార్థినిలకు శిక్షణ ఇచ్చారు.

డాక్టర్ విశాల్ మాట్లాడుతూ…

ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోను మొజ్లో పడి ఎల్లా చెడు దారుల పడుతున్నారో, ఏలా తప్పు దోవ పడుతున్నారో, ఎలా వ్యసనాలకు అలవాటుపడుతున్నారో క్లుప్తంగా వివరిస్తూ మంచి వైపు వెళుతూ మంచి భవిష్యత్తుకోసం ముందుకు వెళ్లే విధంగా పలు సూచనలు చేశారు. అనంతరం మోటివేషనల్ స్పీకర్ శ్రీహరి మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్ధులు ఎలా ఉండా లో మెలకువలను నేర్పించారు విద్యార్థులు తమ లక్ష్యాలను ఎలా ఎంచుకోవాలి ఎలా లక్ష్యసాధనకు ముందుకు వెళ్లాలో పలు అంశాలను క్లుప్తంగా వివరించారు.

గమనిక: ఈ శిక్షణ కోసం ఆసక్తి గలవారు రేపటి వరకు ధరఖాస్తు చేసుకోగలరు. ఈ కార్యక్రమంలో ట్రెయినింగ్ ఐ.పి.యస్ శ్రీ సాయి కిరణ్ పత్తిపాక ,సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్. సురేష్ కుమార్, యోగ మాస్టర్ శ్రీ జె. కిషన్, తైక్వాండో ట్రెయినర్ శ్రీ మనోజ్, మరియు రూరల్ పోలీస్ సిబ్బంది, శిక్షణ పొందడానికి వచ్చిన విద్యార్థినిలు హజరయినారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments