HomeTelanganaNizamabadకరాటే మాస్టర్ నుంచి కాంగ్రెస్ అధినేత దాక ......ఓకే యేడాది రెండు పదవులు ఎమ్మెల్సీ ,పీసీసీ...

కరాటే మాస్టర్ నుంచి కాంగ్రెస్ అధినేత దాక ……ఓకే యేడాది రెండు పదవులు ఎమ్మెల్సీ ,పీసీసీ చీఫ్ ……ఒడిదుడుకులతో మహేష్ కుమార్.. గౌడ్ ప్రస్థానం

బతుకు దెరువుకోసం కరాటే మాస్టర్ జీవనం సాగిస్తు దివంగత నేత డీఎస్ పిలుపు తో యన్ ఎస్ యూ ఐ ద్వార రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అనేక ఒడిదొడుకులు ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.

ప్రతికూల పరిస్థితులను అధిగమించి రాజకీయ ప్రస్థానం సాగించారు. సక్సెస్ కోసం ఆయన మూడున్నర దశాబ్దాల కోసం శ్రమిస్తూ వస్తున్నారు.

అందుకే ఓకే ఏడాది ఆయన రెండు పదవుల దక్కాయి.ఎమ్మెల్సీ గా పీసీసీ చీఫ్ గా నియామకం అయ్యారు. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు.

గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి స్థానిక శంకర్ భవన్ స్కూల్ లో కరాటే మాస్టర్ జీవనం మొదలు పెట్టారు అదే ఆయన చురుకు దనం గమనించిన డీఎస్ మహేష్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు గతంలో డీఎస్ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యంలో మహేష్ ను కు సైతం 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షపదవీ కట్టబెట్టారు.

జిల్లాలో ఆ సంస్థ బలోపేతం చేసి అందరి దృష్టి లో పడ్డారు. ఆ తర్వాత కొద్దీ కాలానికే యన్ యస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. ఆ పదవీ లో ఇప్పటిదాకా మహేష్ సుదీర్ఘ కాలం ఉన్నారు. అప్పుడే .

1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసే అవకాశం వచ్చింది.కానీ ఓటమిపాలయ్యారు. కానీ మరోసటి ఎన్నికల్లో ఆయన కు టికెట్ రాకుండా డీఎస్ అడ్డుకున్నారు.

పైగా కాంగ్రెస్ పార్టీలో గడ్డు రోజులను తట్టుకోలేక టీడీపీ లో కి వెళ్లారు. కానీ ఆ పార్టీ కొద్దీ నెలలకూడా ఇమడ లేక పోయారు. తిరిగి వైయస్ ప్రోత్సహం తో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేసారు. దీనితో ఆయన 2013 నుంచ 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు.

ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు.

అయితే.. రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ పదవిని హైకమాండ్ కట్టబెట్టింది. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

2018 2023 ఎన్నికల్లో అర్బన్ టికెట్ ఆశించి నప్పటికీ మైనారిటీలకు సర్దు బాటు చేయాల్సి రావడంతో అధిష్టానం సూచనతో తప్పుకున్నారు. అదే ఆయన కు ఢిల్లీ పెద్దల వద్ద మంచి మార్క్ లు పడేలా చేసాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments