విశ్వ నగరం హైదారాబాద్ లో రౌడీ మూకలు నడ్డి రోడ్డుమీద చెలరేగిపోయారు. ఓ రౌడీ షీటర్ ను సినిమా ఫక్కీ లోనే వెంటాడి కిరాతకంగా హత్య చేశారు.ఈ ఘటన గురువారం అర్థరాత్రి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మొదట కారుతో యాక్సిడెంట్ చేసి రివాల్వర్‌తో కాల్పులు జరిపి నడి రోడ్డు మీదే మట్టుబెట్టారు .. బాబానగర్ సీ-బ్లాక్‌కు చెందిన రియాజ్ అలియాస్ మెంటల్ రియాజ్ (45) మీద కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ గా నమోదు అయ్యారు .
అతని మీద హత్య హత్యాయత్నం కేసులున్నాయి. రియాజ్ గురువారం అర్ధరాత్రి బాలాపూర్ మంచి నుంచి బైక్‌పై వెళ్తున్నాడు. స్కూల్ ప్రాంతంలో అప్పటికే మాటు వేసిన ప్రత్యర్థులు 15 మంది కారుతో బైక్‌మీద వెళ్తున్న రియాజ్ ను వెంటాడారు. వెనుక నుంచి ఢీకొట్టారు. దీనితో రియాజ్ కింద పడిపోయాడు.
అదే అదనుగా చేసుకున్న ప్రత్యర్థులు మూకుమ్మడిగా దాడి చేసారు. చివరికి తుపాకీ తో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు దీనితో రియాజ్ అక్కడిక్కడే కుప్పకూలి పోయాడు. .
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు ఓ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రియాజ్ ఛాతి, శరీరంలోని ఇతర భాగాలలో గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.