వివాహిత ఆత్మ హత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు కు చెందిన రాణిదేవి(30)గత 15సంవత్సరాలుగా నగరంలోని న్యూ గంజ్ లో ఉంటున్నారు.
ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేక తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈమేరకు గురువారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త శ్రీచందన్ దాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు.