Thursday, January 15, 2026
HomeCRIMEగురుకులం విషాదం …..కడుపు నొప్పి తో ఒకరు మృతి ….మరో ఇద్దరు నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు

గురుకులం విషాదం …..కడుపు నొప్పి తో ఒకరు మృతి ….మరో ఇద్దరు నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు

పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ..అస్వస్ధ కు గురైన ఓ విద్యార్థి ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 6వ తరగతి కి చెందిన ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొదట అనిరుద్ తెల్లవారుజామున 3 గంటలకు కడుపు నొప్పితో తీవ్రం కావడంతో హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ ఆసుపత్రికి చేరేలోపే చనిపోయాడు.

అనిరుద్ ది సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట అలాగే మెట్ పల్లి మండలం ఆత్మకూర్ చెందిన మోక్షిత్, మల్యాల మండలం తాటి పెళ్లి గ్రామానికి చెందిన హేమంత్ యాదవ్ లను నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు చెప్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!