HomeCRIMEపోలీస్ స్టేషన్ లో గంజాయి మాయం..?ఎలుకలు మింగేసాయట ? అరా తీస్తున్న స్పెషల్ బ్రాంచ్ ......

పోలీస్ స్టేషన్ లో గంజాయి మాయం..?ఎలుకలు మింగేసాయట ? అరా తీస్తున్న స్పెషల్ బ్రాంచ్ ……

గంజాయి అమ్మకాలు చెలామణిఫై పోలీస్ కమిషనర్ కఠిన కార్యాచరణకు సిద్ధం అవుతుంటే. మరో వైపు స్థానిక పోలీసులు ఎన్నో వ్యయా ప్రయాసాలు పడి పట్టుకున్న గంజాయి ని భద్రంగా నిల్వ చేయడంలో కూడా శ్రద్ద చూపడం లేదు. బహిరంగ మార్కెటలో ఎంతో విలువ ఉండే గంజాయి సంబంధిత అధికారులే ఠాణాల్లో భద్ర పర్చాలి.

గంజాయి సైతంరెక్కలు వస్తున్నాయి స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలాంటి సొత్తు అయినా కేసు తేలే వరుకు జాగ్రత గా వుంచాలి. నగరంలోని ఓ పోలీసు స్టేషన్ లో పట్టుకున్న గంజాయి భారీఎత్తున మాయం కావడం పోలీస్ శాఖ లో చర్చనీయాంశం అయింది.

ఈ పాటికే వ్యవహరం బయటికి పొక్కడం తో స్పెషల్ బ్రాంచ్ అధికారులు సైతం రంగంలో దిగి అరా తీస్తున్నారు వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని ఆ స్టేషన్‌లో ఉన్న ఓ గదిలో భద్రపరిచారు.

ఓ కానిస్టేబుల్ స్వయంగా భద్ర పరిచారు ఆ స్టేషన్ లో సుమారు 150 కిలోలకు పైగా నిల్వ ఉన్న గంజాయి ఇప్పడు 25 కిలోలకు మించి లేదు. 100 కు కిలోలకుపైగా గంజాయి మాయం అయ్యింది. అయితే స్టేషన్ లో ఎలుకల బెడద ఎక్కవగా ఉందని గంజాయి ని ఎలుకలు తినేసి వుంటాయనే వాదన స్టేషన్ సిబ్బంది తెరమీదికి తెచ్చా రు.

పోలీస్‌స్టేషన్‌ నుంచే గంజాయి మాయం కావడం అధికారులనే కలవర పెడుతుంది. ఆయా కేసుల్లో వచ్చే నిందితులే మాయం చేసారా ? లేదంటే స్టేషన్ సిబ్బంది అడపా దడపా అమ్మేశారా ? అనేది అరా తీస్తున్న .

గంజాయి కేసు పోలీసు శాఖకు అప్రతిష్ట తెచ్చే పరిస్థితి ఉండడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. గతంలో నగరంలోని రైల్వేపోలీస్ స్టేషన్ లో కూడా ఇలాగే పట్టుబడిన గంజాయి మాయం అయింది.

ఉన్నతాధికారులు అడిగితే ఇలాగే ఎలుకలు తిన్నదని అక్కడి పోలీసులు. బుకాయించారు తీర అప్పటి సీఐ వచ్చి విచారణ చేసారు స్టేషన్ నుంచి నగరానికి చెందిన బడా స్మగ్లర్ ఎస్సై తో డీల్ చేసుకొని గంజాయి స్టేషన్ నుంచి తీసుకెళ్లాడు ఆ తతంగం మొత్తం సీసీ కెమెరా ల్లో కనిపించింది చివరికి ఎస్సై తో పాటు నలుగురిని అరెస్టు చేసారు .

కానీ ఈసారి నగరంలో పోలీస్ స్టేషన్ నుంచే గంజాయి మాయం కావడం యాదృచ్ఛికమేనా లేదంటే కాసులకు కక్కర్తి పడి సిబ్బందే మాయం చేసారా అనేది తేలాల్సి ఉంది.

వరుస గా ఒకే తరహా నేరాలకు పాల్పడే వారి మీద అవసరం అయితే గంజాయి కేసు కూడా బనాయించే ఆనవాయితీ ఉంది అలాంటి వ్యవహారాల కోసం ఏమైనా గంజాయి దారి మల్లిందా ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments