ఈ ఘటన మాక్లూర్ మండలంలోని అమ్రాద్ తండాలో చోటు చేసుకుంది.
పోలీసుల సమాచారం మేరకు.. మాక్లూర్ మండలంలోని అమ్రాద్ తండాకు చెందిన మేఘావత్ లక్ష్మీ కి,భావ కుమారుడైన నరేశ్ కు మద్యం భూమి విషయంలో ఘర్షణ ఏర్పడినట్లు తెలిపారు.
ఈ ఘర్షణలో నరేష్ కిటికీ అద్దం పగల గొట్టి అద్దం ముక్కతో లక్ష్మీ పై దాడి చేసినట్లు తెలిపారు.దీంతో హుటాహుటిన మహిళను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల సమాచారం మేరకు స్థానికి మాక్లూర్ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.
