ఆన్లైన్ లో డబ్బులు జమ జేశానంటూ ఫేక్ మెసేజ్ చూపెట్టి మోసం చేసిన సంఘటన నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.
వినాయక్ నగర్ కు చెందిన రాఘవేంద్ర చారి గురువారం ఆర్యానగర్ బ్యాంకులోనీ డిపాజిట్ మిషన్లో నగదు జమ చేయడానికి వెళ్లారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి తనకు డబ్బులు అవసరం ఉందని చెప్పి..
రాఘవేంద్ర నుంచి 50వేలు నగదు తీసుకున్నాడు. ఆన్లైన్లో రాఘవేంద్ర కు డబ్బులు వేసినట్లు ఫేక్ మెసేజ్ చూపెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు.
కొద్ది సేపటికి తన ఖాతాలో డబ్బులు జమ కాలేదని మోసపోయానని గుర్తించిన బాధితుడు నాలుగో టౌన్ లో ఫిర్యాధు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
