HomeLaw and Orderకార్పొరేట్ సేవలో ట్రాఫిక్ పోలీసులు ……భారీగా నజరానాలు ……మెయిన్ రోడ్ల మీదే పార్కింగ్ .గంటల తరబడిగా...

కార్పొరేట్ సేవలో ట్రాఫిక్ పోలీసులు ……భారీగా నజరానాలు ……మెయిన్ రోడ్ల మీదే పార్కింగ్ .గంటల తరబడిగా నిలిచి పోతున్న వాహనాలు. చెన్నయ్ …అనగా ..షాపింగ్ మాల్స్ ముందు ట్రాఫిక్ అస్తవ్యస్తం …..

చలానా లపేరుతో సామాన్యప్రజల ఉసురు పోసుకొనే ట్రాఫిక్ పోలీసులు నగరంలో బడా షాపింగ్ మాల్స్ నిర్వాహకులసేవలో సేద తీరుతున్నారు. గంటల తరబడిగా ఆయామాల్స్ ముందు విధులు చేస్తూ యజమానులసేవలో తరిస్తున్నారు వారిచ్చే నజరానాలా కోసం వెంపర్లాడుతున్నారు. ఆయా మాల్స్ కోసం వచ్చే వాహనాలకు అసౌకర్యం కలగకుండా శ్రమిస్తున్నారు. గత వారం రోజులుగా ట్రాఫిక్ పోలీసులనిర్వాహకం చూసి అంతా నివ్వెర పోతున్నారు ….


బ్యాంకు ….ఆసుపత్రులు ….సూపర్‌ మార్కెట్‌ ల ముందు అయినా సరే వాహనాలు రోడ్ల మీద బారులు తీరుతె చాలు ఫొటో కొట్టి వెయ్యి…అయిదు వందల జరిమానా వేసి తాట తీస్తారు ట్రాఫిక పోలీసులు ….కానీ అదే కోట్ల రుపాయల వ్యయం తో కళ్ళు చెదిరే బహుళఅంతస్తుల్లో నిర్మాణాలు ….

అందులో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యాపార లు అంతే స్థాయిలో వ్యాపార లావాదేవీలు ఒక్కో సీజన్‌ లో కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్న భారీ వస్త్ర వ్యాపారులవిషయంలో సానుకూలత చూపిస్తున్నారు..

నగరం లో ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజానీకం సతమతం అవుతున్న పట్టించుకోరు. రద్దీఉన్న ప్రాంతాల్లో వాహనాల నియంత్రణ ఫై చేతులెత్తేసిన ట్రాఫిక్ పోలీసులు మాల్స్ వద్ద ట్రాఫిక్ రద్దీ లేకుండా మాత్రం చెమటోడ్చుతున్నారు దసరా సీజన్‌ లో వారి దందా కు డోకా రాకుండా జాగ్రత లు పడుతున్నారు .

నగరంలో ఎలాగో ట్రాఫిక్ నియంత్రణ ను ఏనాడో గాలికి వదిలేసిన ట్రాఫిక్ పోలీసులు .కేవలం చలానా లతో కాలక్షేపం చేస్తున్నారనే అపవాదు ఉంది ప్రధాన ప్రాంతాల్లో రద్దీ తో అడుగుముందుకేయడమే కష్టంగా మారింది.అయితే ప్రధాన రోడ్ల మీద వ్యాపార సముదాయాలు ముందు వాహనాలు నిలిపితే రయ్యున వచ్చే ట్రాఫిక పోలీసు ఫొటో కొట్టేసి వెళ్ళుతారు .

వాహనాలు ఆయా ప్రాంతాల్లో ని బ్యాంకు లు సూపర్‌ మార్కెట్‌ లాంటి సముదాయాల ముందు వాహనాలు పార్క్‌ చేయడమే లేటు కెమెరా తో పోలీసు దిగిపోతున్నాడు.అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లేవారిని సైతం వదలడం లేదు. అందుకే నగరంలో కొన్ని వ్యాపార సముదాయాల ముందు సొంతగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొంటున్నాయి.

ట్రాఫిక్ జరిమానాలకు భయపడి షాప్‌ ల ముందు వాహనాలు నిలపడానికి వెనుకాడు తున్నారు.కానీ వస్త్ర వ్యాపార సముదాయాల ముందు రోజు వందలాది వాహనాలు రోడ్ల మీదే పార్క్‌ చేస్తున్నారు.

గంటల తరబడిగా ట్రాఫిక నిలిచిపోతుంది.అయినా పోలీసులు పట్టించుకోకపోగా వస్త్ర వ్యాపారుల సేవకోసం తహతహ లాడుతున్నారు.ఇతర ప్రాంతాల్లో ఏలా ఉన్న ఖలీల్‌ వాడి ప్రాంతంలో కిసాన్‌ అనగా చెన్నయ్ సౌత్ ఇండియా, వస్త్ర షాపింగ్‌ మాల్స్‌ ముందు ట్రాఫిక్ పోలీసులు కనీసం ఇద్దరు విధుల్లో ఉంటున్నారు.

రోజంతా ఆ ప్రాంతంలో ట్రఫిక్ నిలిచిపోకుండా శ్రమిస్తున్నారు.ఈ షాపింగ్‌ మాల్స్‌ ఓనర్లు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వారివి కావడం వల్లే పోలీసులు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ సీజన్‌ లో కోట్ల రూపాయల లావాదేవీలు చేసుకునే మాల్స్‌ యజమానులు కనీసం పార్కింగ్‌ సదుపాయం కూడా లేకుండా నిర్మాణాలు చేసారు.మాల్స్‌ ముందు ఎదో మొక్కుబడిగా పార్కింగ్‌ స్థలము ఉన్నా సరే మరో రెండు వరుసలు రోడ్డు మీదే ఉంటున్నాయి.

నిజానికి ట్రాఫిక పోలీసులు ఇక్కడ కూడా రోడ్డు మీద పార్కింగ్‌ చేసే వాహనాలకు జరిమానాలు వేస్తె మాల్స్‌ కు గిరాకీ దెబ్బ తింటుంది.అందుకే ఈ మాల్స్‌ ముందు రోడ్ల మీద పార్క్‌ చేసిన వాహనాలకు జరిమానాలు వేయడం లేదు.పైగా మాల్స్‌ ముందు ట్రాఫిక కంట్రోల్‌ చేయడానికి రోజంతా చెమటోడ్చుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments