ఒకసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా- ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్- జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఇబ్రహీంపట్నం మండలంలో ఎన్నికల ప్రచారం – పాల్గొన్న జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు , కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్- రేవంత్ రెడ్డి పక్కా అబద్ధాల జూటకోర్- కాంగ్రెస్, బిజెపి లు ఒకే కూటమి- ప్రజలు మోసపోయినందువల్లే కాంగ్రెస్ గెలిచిందిపార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించి ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ, వేములకుర్తి, గోధూర్, మెట్పల్లి పట్టణంలో పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఆయన వెంట కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జగిత్యాల టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… తాను మేడిపల్లి మండలం దేశాయిపేట గ్రామంలో పుట్టానని, దూరపు వ్యక్తిని కాదు మీ దగ్గర వాడినన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4000 పింఛన్ ఇస్తామని, అవ్వలకు అక్కలకు చెల్లెళ్లకు, సౌభాగ్య లక్ష్మి కింద 2000 ఇస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి.. మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతుబంధు , కళ్యాణ లక్ష్మి తులం బంగారం , 4000 పింఛన్ , రుణమాఫీ రెండు లక్షలు ఎక్కడ అని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
మోసపూరితమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నమ్మవద్దని పేర్కొన్నారు.అలాగే ఎంపీ అరవింద్ మోడీ పేరు చెప్పి.. రాముడు పేరు చెప్పి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తుడని, ఐదేళ్లలో చేసింది ఏమి లేదన్నారు .
ఐదు రోజుల్లో తెస్తానన్న పసుబోర్డు ఐదు సంవత్సరాలయిందని, మళ్లీ మోసం చేయడానికి.. మోడీ పేరు రాముడు పేరు అడ్డం పెట్టుకొని వస్తున్నాడన్నారు బి.ఆర్.ఎస్ పార్టీ..ప్రజల పార్టీ అని, కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.
వచ్చేనెల 13 తారీకున పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.