హాస్టల్ సమస్యల పరిష్కారానికి విద్యార్థులు రోడ్డెక్కారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తా రోకో చేసారు. నిజామాబాదు నగరంలోని నాందేవ్ వాడ లో ఎస్టీ హాస్టల్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా లో ఆందోళనకు దిగారు.
రోజు తినే అన్నం లో పురుగులు వస్తున్నాయని కనీస నాణ్యత లేని నిత్యావసర సరుకులతో వంట చేస్తున్నారని అదే వంటకాలు తిని అనారోగ్యాలకు గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తాగడానికి నీళ్లు కూడా దొరకడం లేదని వార్డెన్ హాస్టల్ నిర్వహణ పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థుల ఆందోళనతో మూడువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు
