లోకసభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధిచెప్పడం ఖాయమని బిఆర్ యస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు ఆయన శనివారం
పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలో జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాలలతో కలిసి పాల్గొన్నారు *
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ఎగరవేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……
తెలంగాణ రాష్ట్రం సాధన కోసం చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ గత తొమ్మిదేళ్లుగా తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు అంటే పాలన ఎలా ఉందో తెలుస్తుంది
నీళ్లు లేక పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకునే నాధుడు కరువయ్యాడు
తెలంగాణ రాష్ట్రాన్ని తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సాధిస్తే ప్రస్తుతం దొంగల రాజ్యం ఏలుతుంది
ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు తప్ప చేసింది ఏమీ లేదు .
రైతుబంధు, రుణమాఫీ, కళ్యాణ్ లక్ష్మి, రైతు బోనస్ ఇవ్వడానికి చేత కాదు గాని బిఆర్ఎస్ అధినేత గౌ.శ్రీ కేసిఆర్ పై లేనిపోని విమర్శలు చేస్తున్నారు.
గ్రామంలో పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎందుకు పోగొట్టుకున్నామని బాధపడుతున్నారు
మళ్లీ సరే రావాలి కారే కావాలని గల్లీ గల్లీలో మండలాల్లో గ్రామాల్లో మళ్ళీ ఊపు అందుకుంటుంది
ఏ లక్ష్యానికి అయితే తమ పార్టీ ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ తెలంగాణలో ఏ ఒక్కరికి కూడా సమస్యలు లేకుండా పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తునం
తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణం లెక్కచేయకుండా ఉద్యమం చేసి అన్ని వర్గాలను కలుపుకొని ఏక తాటిపై నడిచి ఉద్యమాన్ని నడిపించిన ఘనత కెసిఆర్ ది .
ప్రజల్లో మార్పు మొదలైందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రస్తుతం లేరని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ పండగ వాతావరణం లో జరుపుకుంటున్నారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థులను ప్రతి ఒక్కరిని గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.
కార్యక్రమంలో నిజామాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, నగర మేయర్ దండు నీతూ కిరణ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, సుజిత్ సింగ్ ఠాగూర్ , సత్య ప్రకాష్ , మాజీ కూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీర్ప రాజు, ఏనుగదుల మురళి, కరపే రాజు, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.