ఓ వైన్స్ కు సంబంధించి బోర్డు మీద పడడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. బాధితులు పిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు వైన్స్ యజమాని ని సంప్రదిస్తే ఎహే తొక్కలపిర్యాదు నేను మాజీ మంత్రి సన్నిహితుడిని మాజీ నవీపేట్ జెడ్పిటిసి సభ్యుడి అంటూ ఎదురు దబాయించడంతో పోలీసులు నిస్సహాయులయ్యారు.
సదురు నేత కనీసం ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.నగర శివారు లో మాణిక్ భాండార్ x రోడ్ వద్ద ఉన్న లిక్కర్ లాండ్ వైన్స్ పేరు గల ఫ్లెక్స్ బోర్డ్ కు మరమత్తులు చేస్తుండగా, దానిని ఒక్కసారిగా వాళ్ళు వదిలేయడంతో అక్కడ మద్యం కొనుగోలు చేయడానికి వచ్చిన ఇద్దరూ యువకుల మీద ఆ బోర్డ్. పడింది. దీనితో వారికి తీవ్రగాయాలు అయ్యాయి
. స్థానికులు సమచారంతో ఇవ్వడంతో తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమత్తం నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు.ప్రాణాలు పోతున్న పట్టింపు లేకుండా, ప్రశ్నిస్తే యజమాని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.
తాము అధికార పార్టీలోనూ అందులోనూ అగ్ర నేత అనుయాయులుగా ఉన్నామనే ధీమాతో వైన్స్ షాపుల యాజమాన్యం ఈ ఘటన ను లైట్ గా తీసుకుంది. ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ సదురు యజమాని సిబ్బంది తో తెగేసి చెప్పించాడు. దీనితో అయితే బాధితులు చేసేది లేక మాక్లుర్ మండల పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
యువకుడు గాయాలు చూసి చలించిపోయిన పోలీసులు సదురు యజమాని ఫోన్ చేసివిషయం చెప్పడంతో ఎస్సై కి సైతం ఇదే తరహాలో ధమ్కీ ఇచ్చినట్లు సమాచారం. సదురు మాజీ మంత్రి అనుయాయుడు మద్యం వ్యాపారి గా అవతారం ఎత్తారు.పొలిటికల్ ముసుగులో మద్యం దందా ఎలా చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో ఉన్నారు