ఇంటిముందు ముగ్గు వేస్తున్న మహిళా మీద మూకుమ్మడిగా దాడి ఆమె మెడలో నుంచి గొలుసు ఎత్తుకెళ్లారు తూప్రాన్ పట్టణంలోని ఎల్లమ్మ కాలనీలో గురువారం జరిగింది .
ఉదయం ఏడు గంటల సమయంలో రంగమ్మ తన ఇంటిముందు ముగ్గు వేస్తుంది.ఇదే సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు మెడలో ఉన్న తన మెడలో ఉన్న ఆరు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు .
గొలుసు రెండు వరుసలు ఉండడంతో రాకపోవడంతో ఆమెను కిందకి తోసేసి నోరు మూసి చోరీకి పాల్పడ్డారు.దీంతో ఆమెకు గాయాలు అయ్యాయి.
గట్టిగా అరవడం తో చుట్టుపక్కల వారు హుటాహుటిన వచ్చారు నిందితులను వెంబడించడం తో తన ద్విచక్ర వాహనాన్ని వదిలి పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
