ఇసుక తవ్వకాలు రవాణా ల మీద కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖను ప్రభుత్వం పురమాయించింది. ఈనేపథ్యంలో కొత్త పోలీసు కమిషనర్ సాయి చైతన్య సైతం అదే అంశం ను మొదటి ప్రాధాన్యతగాతీసుకున్నారు.
బుధవారం హైదారాబాద్ లో ఉన్నతాధికారులను కలసి పొద్దుపోయాక నిజామాబాద్ వచ్చిన ఆయన మొదటి సమీక్షా సమావేశం ఇసుక మీద నిర్వహించారు ఇసుక తవ్వకాలు అక్రమ రవాణా జరిగే ప్రాంతాల కు చెందిన క్షేత్ర స్థాయి అధికారులను అత్యవసరంగా కమిషనరేట్ కు పిలిచి ఆయనే తదుపరి చర్యల మీద దిశానిర్దేశం చేసారు.
ఇసుక తవ్వకాలు ….రవాణా ల విషయంలో కఠినంగా వుండాలని ఏ మాత్రం ఉపేక్షించినా శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉన్నపలంగా ఇసుక క్వారీల ను గుర్తించి మూసేయించాలని అనుమతుల ముసుగు లో ఇసుక దందా సాగించడానికి వీలు లేదని ఆయన పేర్కొన్నారు
