…పసుపు బోర్డు తెచ్చామని గప్పాలు కొడుతున్న బిజెపి నాయకులు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పు గంగారెడ్డి ప్రశ్నించారు.
గిట్టు బాటు ధర రాక రైతులు అల్లాడి పోతున్నారని వారికి భరోసా ఇవ్వాల్సిన బీజేపీ నేతలు ఎక్కడ దాక్కున్నారని ఆయన నిలదీశారు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర లేక రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్న బిజెపి ఎంపీకి నాయకులకు కనిపించడం లేదని ఆగ్రహించారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఆకాశాన్ని తాకే విధంగా ఉంటాయని మభ్యమెట్టి రైతులను మోసం చేశారని ద్వజమెత్తారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకున్నారనీ ఎద్దేవ చేశారు. జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న నాకు కనీసం బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో తెలియదనీ తెలిపారు. రైతులకు దాని విధివిధానాలు కూడా తెలియవని అన్నారు.
పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం పసుపు రైతులను పరామర్శించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేవలం ఎంపీ ధర్మపురి అరవింద్ డిల్లీలో కూర్చొని పైరవీలు చేయటానికే సరిపోతున్నారని,రైతుల బాధలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు పసుపు బోర్డు వస్తే మద్దతు ధర రూ 20,000 ఉంటుందని పసుపునకు దేశంలో మంచి డిమాండ్ ఉందని కలబొల్లి మాటలతో మభ్యపెట్టారని తెలిపారు. ఇక నవోదయ విషయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు.
కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.బిజెపి చేసిన అభివృద్ధిపై ఎక్కడికి రమ్మంటారో చెప్పాలనీ సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
