HomeCRIMEఒంటరి వృద్ధురాలి మెడలోంచి బంగారు గొలుసు అపహరణ

ఒంటరి వృద్ధురాలి మెడలోంచి బంగారు గొలుసు అపహరణ

ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును అపహరించిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

స్థానిక సమాచారం మేరకు, వీక్లీ మార్కెట్ ప్రాంతానికి చెందిన విజయ అనే వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇదే అవకాశంగా భావించిన దుండగుడు ఇంట్లోకి చొరబడి, ఆమె మెడలోని .మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ ఎస్ఐ మొగులయ్య దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, నిందితుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

స్థానిక ప్రజలు ఒంటరిగా ఉన్న వృద్ధుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నేరస్తుడిని త్వరగా పట్టుకుని, బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments