స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థుల ఆటోలో బోల్తా పడింది. ఈ ఘటన నగరంలోని సుభాష్ నగర్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్ళితే..
నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న షేక్ హైమద్, వినిత్ నంద లతో పాటు మరి కొందరు విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలో ఒక్కసారిగా ఆటో బోల్తా పడింది.
దీంతో షేక్ హైమద్, వినిత్ నంద లకు గాయాలయ్యాయి.స్థానికుల గమనించి హుటాహుటిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు.
