HomeTelanganaNizamabadలోకల్ క్యాడర్ డీలా .....ఇప్పట్లో ఎన్నికలు లేవంటూ సర్కార్ సంకేతాలు ......ఊపిరి పీల్చుకున్న నేతలు

లోకల్ క్యాడర్ డీలా …..ఇప్పట్లో ఎన్నికలు లేవంటూ సర్కార్ సంకేతాలు ……ఊపిరి పీల్చుకున్న నేతలు

బిసి రిజర్వేషన్ లకు చట్టబద్దత కలిపించే దాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. అందుకే ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

దీనితో స్థానిక ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న లోకల్ క్యాడర్ ఒక్కసారి గా డీలా పడిపోయింది.క్షేత్ర స్థాయిలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బడా నేతలు ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తీ అయింది.

పదేళ్ల తరవాత అధికారం చేజిక్కడంతో క్యాడర్ లో పదవు ఆశలు చిగురించాయి. అందుకే నిర్ణిత గడువులో సర్పంచ్ యంపిటీసీ సహకార సంఘాల కు ఎన్నికలు నిర్వహిస్తే కింది స్థాయి క్యాడర్ కు అనేక పదవులు దక్కే అవకాశం ఉంటుందనేది కాంగ్రెస్ అధిష్టాన ఆలోచనగా ఉండే ! ఈ నెలాఖరు లోగ యంపిటీసీ జెడ్పిటిసి ఆ తరవాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం అయింది.

జిల్లాలో యంత్రాంగం ను సైతం ఇదే కార్యంలో బిజీ అయ్యారు. ఎన్నికల నిర్వహణలో ఉండే అధికారులకు వర్క్ షాప్ లు సైతం నిర్వహించారు ఓ దశ లో రిజర్వేషన్ పక్రియ కూడా ఒకటి రెండు రోజుల్లో మొదలవుతుందని భావించారు.

మరో వైపు కింది స్థాయిలో నేతలు స్థానిక సమరం కోసం సన్నాహాలు మొదలు పెట్టారు సర్పంచ్ యంపిటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆర్థిక వనరులు సైతం సమకూర్చుకున్నారు. రిజర్వేషన్ అనుకూలంగా రాకపోతే ? ప్రత్యామ్న్యా మార్గాలను సైతం సిద్ధం చేసుకున్నారు.

అనేక గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీ లు సైతం రంగంలోకి దిగాయి. సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవం చేసుకుని భారీ ఆర్థిక లబ్దికి రంగం సిద్ధం చేసుకున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ ఇంచార్జి స్థాయి నేతలు సైతం ఈ ఎన్నికలు అగ్ని పరీక్షా భావించారు. ఒకరిద్దరు తమ సెగ్మెంట్ లో సర్పంచ్ అభ్యర్థులను సైతం ఫైనల్ చేసుకున్నారు.

కానీ ఆయా సంక్షేమ పథకాలు అమలు గందరగోళంగా మారడంతో గ్రామంలో ప్రభుత్వం ఫై ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం అధికార పార్టీ నేతలు దుస్సాధ్యంగా భావిస్తున్నారు.

పలితాలు తేడా వస్తే నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలే కోల్పోతామనే టెన్షన్ సైతం మొదలయ్యింది.ఈ క్రమం లో నే అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరపడానికి సర్కార్ ససేమిరా అనేసింది.

కామారెడ్డి డిక్లరేషన్ మేరకు 42 శాతం బిసి లకు రిజర్వేషన్ ఇవ్వాలని అధికార పార్టీ మీద ఒత్తిడి పెరిగింది. కులగణన నివేదిక సైతం ప్రభుత్వానికి వచ్చింది. మరో వైపు బిసి డేడికేటెడ్ కమిషన్ సైతం నివేదికను ఇచ్చేసింది.

అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి లకు ఏ మేరకు రిజర్వేషన్ ఇవ్వాలనేది సీఎం తో మంత్రులు పార్టీ పెద్దలు ఎడతెగని కసరత్తులు చేశారు.

రిజర్వేషన్ లు 50 శాతం కు మించవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి బిసి లకు 42 శాతం ఇవ్వడం ఎలా అనేది సర్కార్ తర్జన భర్జనలు చేస్తుంది.

అందుకే అసెంబ్లీ బిల్లు ఆమోదించి తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపాలని భావిస్తుంది. బిసి లకు 42 రిజర్వేషన్ కు చట్టబద్దత రావాలంటే పార్లమెంట్ లో నే బిల్లు క్లియర్ కావాలి. సో ఈ పక్రియ ఇప్పట్లో అయ్యే పరిస్థితి వుండదు. అందుకే ఎన్నికలు గోవిందా !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments