HomePOLITICAL NEWSArmoorఓటమి భయంతోనే కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా? రేవంత్ రెడ్డికి,రాహుల్ గాంధీ మధ్య అగాధ...బీఆర్ఎస్...

ఓటమి భయంతోనే కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా? రేవంత్ రెడ్డికి,రాహుల్ గాంధీ మధ్య అగాధ…బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి..

ఓటమి భయంతోనే కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి వచ్చిందని ఆర్మూర్ మాజీ ఎమ్మల్యే జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. గురువారం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన గురించి తెలిసే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీలో కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకటయ్యారని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నికల స్థానాల్లో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. జరిగిన దేశ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకుండా పోయిందని విమర్శించారు.

మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుండు సున్న వచ్చాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగననలో విషయంలో ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్లారు. కానీ ఈ విషయంపై రాహుల్ గాంధీ దగ్గరకు రానివ్వలేదని విమర్శించారు.

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అబద్దాలతోనే కాలం విల్లదిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్లో రాహుల్ గాంధీ చేసిన రైతు డిక్లరేషన్ అమలు కాలేదని, కాబట్టే వరంగల్ డిక్లరేషన్ పై రైతులు నిలదీస్తారని భయపడి రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి,రాహుల్ గాంధీది ఐరన్ లెగ్ అని ఎద్దేవా చేశారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments