ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితారెడ్డికి పలువురు నేతలు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
సోమవారం కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య రంగంలో విశేష అనుభవం ఉన్న కవితారెడ్డి ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తారని ఆకాంక్షించారు.
ప్రజా ఆరోగ్య రక్షణలో సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. డాక్టర్ కవితారెడ్డి నియామకం పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమె ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడతాయని ధీమా వ్యక్తం చేశారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు డాక్టర్ కవితారెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జగడం సుమన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంపత్ తదితరులు పాల్గొన్నారు.
