రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఓ వాణిజ్య పన్నుల శాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ పంజాగుట్ట సర్కిల్ లో పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి .
ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఆడిట్ పూర్తి చేయడంతో పాటు , వారికి ఇదివరకే ఇచ్చిన నోటీసును మూసివేయడానికి ఆ సంస్థ యజమాని నుంచి లంచంకోసం బేరం మొదలు పెట్టారు.
బాధితులు ఏసీబీ ని ఆశ్రయించారు బుధవారం నగదు తీసుకుంటుండగా శ్రీధర్ రెడ్డి ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డిఎస్పీ ఆనంద్ మీడియాకు ఈ కేసు వివరాలు వెల్లడించారు వెల్లడించారు.
ఉప్పల్కు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను మూడేళ్లకు గాను లెక్కింపు చేయించేందుకు పంజాగుట్ట సర్కిల్కు చెందిన స్టేట్ టాక్స్ ఆఫీసర్ శ్రీధర్కు దరఖాస్తు చేసుకున్నాడు.
ఆ వ్యవహారంలోనే భారీ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు
