హత్య కేసును ఆత్మ హత్య కేసు గా మార్చేస్తున్నారని ఆరోపణలతో మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి మరి పోలీసులపై దాడికి తెగ బడిన ఉదంతం హయత్ నగర్ స్టేషన్ లో జరిగింది. ఈ దాడిలో పోలీసులకు గాయాలు అయ్యాయి.
స్టేషన్ లోనే ఉన్న అనుమానితుడిని సైతం తీవ్రంగా కొట్టారు హయత్‌నగర్ బంజారా కాలనీలో గత రాత్రి ఓ వివాహిత అనునాస్పదంగా మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ వ్యక్తి ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు .
ఆ హత్యను ఆత్మహత్యగా చూపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు .
పీఎస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సహనం కోల్పోయి ఆవేశంతో పీఎస్‌లోకి దూసుకెళ్లి పోలీసులపై దాడికి దిగారు.ఈ ఘటన ఫై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు