Saturday, June 14, 2025
HomeCRIMEట్రాఫిక్ ఏసీపా ! మజాకా .....తనిఖీ లో తాట తీస్తున్నారు ..... వాహనం ఎవరిదైనా...

ట్రాఫిక్ ఏసీపా ! మజాకా …..తనిఖీ లో తాట తీస్తున్నారు ….. వాహనం ఎవరిదైనా వదిలేదే లేదు ..! సిఫార్స్ లు లైట్ …..జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలఫై ఉక్కుపాదం …

నగరంలో వాహనాల తనిఖీ లు జరిగాయి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న వాహనం ను ట్రాఫిక్ పోలీసు లు పట్టుకున్నారు.నిబంధనల ప్రకారం జరిమా చెల్లించి వాహనం తీసుకోవాల్సిన సదరు చోట లీడర్ ఓ మాజీ మంత్రి అనుయాయుడిని రంగంలోకి దించాడు.

ఎహే జరిమానా కట్టి బండి తీసుకోవడానికి రికమండేషన్ దేనికి అంటూ ట్రాఫిక్ ఏసీపీ సున్నితంగా చెప్పేసాడు. మరో వాహనం విషయంలో నగరంలో పనిచేసే ఓ సీఐ ఫోన్ చేస్తే చాల లైట్ తీసుకున్నాడు…..ఏ ఆర్ విభాగంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ వెళ్తున్న బండి సైతం ఇలాగే సీజ్ చేశారు.

సదరు కానిస్టేబుల్ ఎంత ప్రాధేయ పడ్డ నో లాభం లేకుండా పోయింది.మొత్తానికి సీజ్ అయిన బండి ట్రాఫిక్ స్టేషన్ దాటాలంటే చుక్కులు చూడాల్సిందే. నిజమనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఏసీపీ నారాయణ అనుసరిస్తున్న కఠిన వైఖరులు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి.

జరిమానాలు కట్టకుండా పైరవీలు చేయించే వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఎహే పోలీసు డిపార్ట్ మెంట్ అయితే నాకేంటి పెనాల్టీ కట్టాల్సిందే అంటూ సొంత పోలీసులనే గద్దిస్తున్నారు.

ఒక్కసారి తమకు చిక్కిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడానికి ఏసిపి ససేమిరా అంటున్నారు. రోడ్డు ప్రమాదాల విషయంలో ఈ మద్యే న్యాయ అధికారులు, పోలీసు రవాణా శాఖ లతో కలెక్టర్ రివ్యూ జరిగింది.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించే వారి విషయంలో ఇక మీద కఠినంగా ఉండేలా కార్యాచరణ అమలు చేయాలనీ నిర్ణయించారు. ఇందులో భాగంగా నే సీపీ కల్మేశ్వర్ సైతం ట్రాఫిక్ ఉల్లంఘనల ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు దిశా నిర్దేశం చేసారు.

స్పెషల్ డ్రైవ్ లకు పురమాయించారు.. సెల్ ఫోన్ మాట్లాడుతూ నడిపే వారు ….ముఖ్యంగా మైనర్ లు మద్యం తాగి నడిపే వారు నెంబర్ లేని వాహనాలు ఎలాంటి పత్రాలు లేని వాహనాలను విషయంలో ఈ డ్రైవ్ లో స్పెషల్ గా ఫోకస్ చేయాలనీ కమిషనర్ ఆదేశాలు.

ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు గత వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ లు చేపట్టారు. నగరంలో ఒక్కో స్టేషన్ పరిధి పరిధి లో స్థానిక పోలీసులతో కలిసి ఈ డ్రైవ్ లు మొదలు పెట్టారు.

నిజానికి పోలీసు శాఖ మీద అధికార పార్టీ నేతల పెత్తనం విచ్చల విడిగా మరీనా నేపథ్యంలో ఇలాంటి డ్రైవ్ లు షరా మాములే అనుకున్నారు. అందులో ట్రాఫిక్ అంటే మరీ లైట్ అనుకున్నారు.

కానీ తనిఖీ ల్లో రోజువారీగా వందలాదివాహనాలు సీజ్ అవుతున్నాయి. నగరంలో పలు చోట్ల లో రాంగ్ రూట్లో , సరైన ధృవ పత్రాలు లేని వాహనాలను స్థానిక స్టేషన్ లకు తరలిస్తున్నారు. కానీ ఆ వాహనాలను విడిపించుకోవడానికి పడే తిప్పలు అన్నీ ఇన్నీకావు.

తానూ చెప్పేదాకా ఎవ్వరూ ఒత్తిడిచేసిన బండి ఇవ్వద్దని ట్రఫిక్ ఏసీపీ హుకుం ఇవ్వడంతో చివరికి సీఐ లుసైతం బండి ఇవ్వడానికి జంకు తున్నారు. ద్వితియ శ్రేణి లీడర్లు వెళ్లి అడిగినా సరే వామ్మో మేము బండి ఇవ్వలేము మిరే ఏసిపి తో చెప్పించండి అంటూ ప్రాధేయ పడుతున్నారు.

ఒకరిద్దరు లీడర్లు ఫోన్ చేసిన సీపీ ఆదేశాలు జరిమా కట్టేసి బండి తీసుకెళ్లాలి అంటూ సున్నితంగా చెప్పేస్తున్నారు.

ఏ ఆర్ కు చెందిన కొందరు కానిస్టేబుళ్లు ద్విచక్ర వాహనాలకు ఇంకా నెంబర్ ప్లేట్ లు పెట్టుకోరు.మూడో టౌన్ ఏరియా లో ఏ ఆర్. కానిస్టేబుల్ బండి ని ఇలాగే సీజ్ చేశారు.సదురు కానిస్టేబుల్ ఎంత వేడుకున్న ఇవ్వలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!