దిలావర్పూర్లో హై టెన్షన్ బుధవారం కూడా కొనసాగింది. పోలీసులపై స్థానికులు రాళ్ల దాడికి దిగారు. పురుగు మందు డబ్బాలతో నిరసన తెలిపారు.
డీఎస్పీ కారు అద్దాలను ధ్వంసం చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నేరుగా రంగంలోకి దిగి రైతులను చర్చలకు ఆహ్వానించారు.
ఆ చర్చలు సఫలం అయ్యేలా చొరవ చూపడంతో దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను విరమించాలని రైతులు డిసైడ్ అయ్యారు.
