మూడు రోజుల పాటు : ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల తో జిల్లాలో అపార నష్టం సంభవించింది .
నష్టం ఏ మేరకు జరిగిందనేది అధికారులు ఇంకా ప్రాథమిక అంచనాల్లో ఉన్నారు కానీ అధికారులు చెప్తున్న నష్టానికి మూడింతలు ఎక్కువే వుందని క్షేత్ర స్థాయి లో పరిస్థితులు చెప్తున్నాయి.
వ్యవసాయ రంగమే ఎక్కువగా నష్టం చవి చూసింది.జిల్లాలోని పలు ప్రాంతాలలో చెరువులు, వాగులు తెగిపోయి రోడ్లు దెబ్బతిన్నాయని వేలాది ఎకరాల పంట నీటమునిగి పోయింది
ఇసుక మేటలు పొలాల్లో వచ్చాయి. సిరికొండ, ధర్పల్లి, భీంగల్, ఇందల్వాయి మండలాల్లోని కొండాపూర్, తూంపల్లి, గడ్కోల్, ముషీర్ నగర్, హోన్నాజీపేట్, వాడి, నడిమితండా, బెజ్జోరా, సిర్నాపల్లి గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని ఆయా ప్రాంతాలలో ఆరు చెరువులు తెగిపోగా, అనేక చోట్ల గండ్లు పడ్డాయి సుమారు 20 ఎకరాలలో పంట నీటమునిగింది 12 ఎకరాల్లో ఇసుక మేటలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు .
వరద నీటి ప్రవాహం తగ్గిన మీదట పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసే ఛాన్స్ ఉంది అలాగే . 13 చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని, 40 చోట్ల ఆర్ అండ్ బీ రోడ్లకు నష్టం జరిగిందని అన్నారు.
వర్షానికి ఒక నివాస గృహం పూర్తిగా కూలిపోయిందని, మరో అనేక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు జిల్లా కేంద్రంలోనే ఫులాంగ్ వాగు పరివాహక ప్రాంతంలో వందలాది గుడిసెల్లోకి వరద నీరు చేరింది.
వందలాది మంది గత రాత్రి పునరావాస కేంద్రాలకు వెళ్లి ఆశ్రయం పొందారు.అలాగే అనేక చోట్ల కరెంటు స్తంభాలు, మరో 60 కండక్టర్లు పడిపోయాయని, కొన్ని చోట్ల ట్రాన్స్ ఫార్మర్లు నీట మునిగాయని ట్రన్స్ కో అధికారులు వెల్లడించారు.
వరద ప్రవాహం వల్ల 15 గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా ట్రాన్స్ కో పునరుద్ధరణ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ధర్పల్లి మండలం వాడి గ్రామంలో ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాన్ని పంపడంతో పాటు, రూరల్ శాసన సభ్యులు భూపతి రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ స్వయంగా గ్రామాలను సందర్శించి ముంపు పరిస్థితిని పర్యవేక్షించారు .
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం చందూర్, ధర్పల్లి, డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్, జక్రాన్పల్లి మండలాల్లో 7 పునరావాస కేంద్రాలను నెలకొల్పి, అవసరమైన ఆహార పదార్థాలు, తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించామని, 164 కుటుంబాలకు చెందిన 358 మంది ఈ శిబిరాలలో ఆశ్రయం పొందుతున్నారని అన్నారు.
జిల్లలో ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించలేదని, వరద నీటిలో చిక్కుకుపోయిన 17 మందిని సురక్షితంగా కాపాడడం జరిగిందని తెలిపారు.
కప్పలవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో భీంగల్ ఎక్సైజ్ కార్యాలయంలో చిక్కుకున్న ఇద్దరిని అగ్నిమాపక శాఖ బృందం రెస్క్యూ చేసిందని అన్నారు.
బెజ్జోర వద్ద ఆటోలో వెళ్తున్న ఆరుగురిని జేసీబీ సహాయంతో కాపాడడం జరిగిందని, ఇందల్వాయి మండల దోన్కల్ లో ఫాంహౌస్ లో చిక్కుకుపోయిన వ్యక్తిని, ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద 8 మందిని కాపాడడం జరిగిందని వివరించారు.
కామారెడ్డి – రామాయంపేట మధ్య హైదరాబాద్ కు వెళ్ళే మార్గంలో వరద నీటి ప్రవాహం వల్ల వాహనాలు ముందుకు వెళ్ళే పరిస్థితి లేక ట్రాఫిక్ స్తంభించిపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్, ముప్కాల్, బాల్కొండ ప్రాంతాల వద్ద జాతీయ రహదారిపై వాహనాలు నిలిపి నిరీక్షిస్తున్న లారీల డ్రైవర్లకు 600 వరకు ఫుడ్ ప్యాకెట్లను ఉచితంగా అందజేశారు
