నగరంలో భారీ వర్షాలతో ఆశ్రయం కోల్పోయిన వారిని పోలీసులు ఆదుకున్నారు వారికి ఆశ్రయం కల్పించారు.
బోర్గం పాంగ్ర వాగు నీళ్లు ఉప్పొంగి ప్రవహించడంతో బ్యాంకు కాలనీ లో నాలా ప్రక్కన ఉన్న దాదాపు 15 కుటుంబాలు నివసిస్తున్న గుడిసెలోకి వరద నీరు వచ్చింది దీనితో వారంతా నిరాశ్రయులయ్యారు, ఫోర్త్ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఉదయ్ లు సిబ్బంది కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని శివాజీ సమితి , స్థానికుల సహాయంతో అక్కడి నుంచి తరలించి పండ్లు పంపిణీ చేసి వారిని బింగి ఫంక్షన్ హాల్ లో మహిళలు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కలిపి దాదాపు 40 మంది కి ఆశ్రయం కల్పించారు
