HomePOLITICAL NEWSNationalవిదేశీ విరాళాల సవరణ బిల్లుపై జాయింట్‌ కమిటీ సభ్యుడిగా ఎంపి అర్వింద్‌..

విదేశీ విరాళాల సవరణ బిల్లుపై జాయింట్‌ కమిటీ సభ్యుడిగా ఎంపి అర్వింద్‌..

విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ (రెగ్యులేషన్‌) అమెండ్మెంట్‌ బిల్లు–2026పై ఏర్పాటు చేసిన జాయింట్‌ కమిటీలో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురికి చోటు లభించింది. గురువారం లోక్‌సభ విడుదల చేసిన అధికారిక బులెటిన్‌లో కమిటీ సభ్యుల జాబితాను ప్రకటించగా.. అందులో అర్వింద్‌ ధర్మపురి పేరు నమోదైంది.

లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 31 మంది సభ్యులతో ఈ జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్వింద్‌ ధర్మపురి మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమైన బాధ్యతను నిర్వర్తించే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు.

తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు.దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ బిల్లుపై జాయింట్‌ కమిటీలో సమగ్రంగా చర్చించి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అర్వింద్‌ తెలిపారు.

నిజామాబాద్‌ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. పార్లమెంటులో ప్రజా సమస్యలతో పాటు దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మరింత బాధ్యతతో పనిచేస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments