ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో ఫులాంగ్ వాగు ప్రవాహం ఉగ్ర రూపం దాల్చింది.దీనితో నిజామాబాద్ నగరంలోని గూపన్ పల్లి శివారు లో వాగు పక్కనే ఉన్న సముదాయాల్లోకి భారీగా వరద నీరు వచ్చేసింది.
అక్కడే ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థ లోకి మోకాలు లోతు మేరకు వరద నీరు చేరింది అక్కడి హాస్టల్ భవనం చుట్టూ వరద నీరు రావడంతో విద్యార్థులు ఆందోళన కు గురయ్యారు.
విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు మున్సిపల్ అధికారులతో కలసి హుటాహుటిన వెళ్లారు. హాస్టల్ భవనంలో ఉన్న విద్యార్థులను ఉన్నపలంగా సమీపంలోని మరో భవనంలోకి తరలించారు.
వాగు పక్కనే నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారని ప్రతియేటా ఫులాంగ్ వాగు కుఏ మాత్రం వరద వచ్చిన ఈ భవనాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు
