HomePOLITICAL NEWSకలిసి పోరాడితే రాజ్యాధికారమే - రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

కలిసి పోరాడితే రాజ్యాధికారమే – రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

ముఖ్యఅతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి – ఆర్మూర్లో రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో బీసీల సదస్సు – పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, ప్రజలు

బీసీలంతా ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు.సమగ్ర కుల జన గణన స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోరుతూ ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మార్ గార్డెన్లో బీసీల సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ…

నిజామాబాద్ జిల్లా ఉద్యమాల జిల్లా అన్నారు. దశాబ్ద కాలంగా ఎంతోమంది గొప్పవారు ఈ జిల్లాలో పుట్టిన గడ్డ అని, ఉద్యమ స్ఫూర్తి గలిగిన జిల్లా నిజామాబాద్ అని పేర్కొన్నారు.

బీసీలంతా ఏకమై కొట్లాడితే రాజ్యాధికారం సాధించవచ్చని పిలుపునిచ్చారు. అక్కడ అక్కడ బీసీ సబ్బండ వర్గాలు ఏకమై కొట్లాడి, దేశవ్యాప్తంగా పోరాడాలి పిలుపునిచ్చారు.

సాధారణమైన వ్యక్తులు దోపిడి పీడన, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చిన మావోను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. రాజ్యాధికారం రావాలంటే తిరుగుబాటు తప్పదని వివరించారు.

అందుకే తమ సమాజంలో బీసీల పాత్ర ప్రముఖమైందని అన్నారు. ధైర్య సాహసాలతో ఉద్యమస్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం పిల్లల రేపటి తరం కోసం బీసీలంతా ఏకము కావాలన్నారు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవిలు మాట్లాడుతూ…దేశంలో దక్షిణ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్రాలు మాత్రమేనని అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బిసి నాయకులు ఉన్నారని.

కేవలం మూడు శాతం మాత్రమే ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు 43 ఎక్కువ శాతం ఉన్నారని అన్నారు. రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు అన్యాయం జరిగిందన్నారు.

స్వాతంత్రం అనంతరం ఏర్పడిన ఉద్యోగ అవకాశాల్లో అగ్రవర్ణ కులాలకు అందిందని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో బిసి నాయకులు బేగం యాదవ్ గౌడ్ మోతే రామా గౌడ్, కొండవీటి శ్యామ్ లతోపాటు జిల్లాకు చెందిన వివిధ కులాల బిసి సంఘ నేతలు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments