అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ బియ్యాన్ని బోధన్ పరిధిలో మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.
బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి 6 బస్తాల పిడిఎస్ రైస్‌ను అక్రమంగా నిల్వ చేశారని విశ్వసనీయ సమాచారం మేరకు వెంటనే అక్కడికి చేరుకుని 6బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీస్ లు తెలిపారు.
