సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో ఘరానా మోసాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. ఆర్మీ అధికారులమంటూ నమ్మించి పాల వ్యాపారినుంచి రూ 2.82 సైబర్ నేరగాళ్ళు కాజేశారు.
ఈ సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో చోటుచేసుకుంది. గాంధారి మండలం కు చెందిన పాల వ్యాపారి నారాయణరావుకు గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు.
మేము ఆర్మీ అధికారులము మాకు పాలు కావాలని, పాల కోసం కొంత అడ్వాన్స్ చెల్లిస్తామని బురిడీ కొట్టించాడు.దీంతో సైబర్ నేరగాళ్లు బాధితుడి ఫోన్ కి ఓటీపీ పంపారు.
బాధితుడు ఓటీపీ ఓపెన్ చేయగానే విడతల వారీగా ఖాతా నుంచి మొత్తం రూ.2.82 లక్షలు నగదు డెబిట్ అయినట్లు ఫోన్ కు మెసేజ్ వచ్చిందనీ తెలిపారు.
దీంతో సదరు బాధితుడు గాంధారి పోలీసులకు సమాచారం అందించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
