విద్యుత్ ఘాతం తో మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను బోధన్ రూరల్ సీఐ,విజయ్ బాబు,పోలీస్ సిబ్బంది పొలంనుంచి రోడ్డుకు మోసుకొచ్చారు.
వివరాల్లోకి వెళ్లితే.. రెంజల్ మండలం చాటాపూర్ గ్రామానికి చెందిన గంగారం, బాలమణి, వారి కుమారుడు కిషన్ ముగ్గురు వ్యక్తులు విద్యుత్ ఘాతంతో పొలంలో మృతి చెందారు.
దీంతో స్థానికుల సమాచారం మేరకు బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రోడ్డుకు మోసుకొచ్చారు.దీంతో స్థానికులు పోలీసులను అభినందించారు.
