నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం గురువారం కలకలం రేపింది. స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి చెందిన సంపులో మహిళ మృతదేహం కనిపించింది.
పోలీసుల వివరాల ప్రకారం, అల్జాపూర్‌కు చెందిన రాజేశ్ అనే వ్యక్తి కొత్తగా నిర్మిస్తున్న భవనంలో సుమారు 40-45 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ ఫిట్స్‌తో సంపులో పడి మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనను భవనానికి వాచ్మెన్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. మహిళ వివరాలు తెలిసినవారు 8712695858 నంబర్‌కు సంప్రదించాలని ఆర్మూర్ SHO విజ్ఞప్తి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
