HomeLaw and Orderకలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం

కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం

నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ప్రారంభోత్సవం చేశారు.

కార్యాలయంలోని ఆయా విభాగాలను సందర్శించి వసతులను పరిశీలించారు.

సందర్శకుల కోసం అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పూర్తి పారదర్శకంగా, సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇంచార్జి రూరల్ తహసీల్దార్ వినయ్ సాగర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రమణ్ రెడ్డి, శ్రీనివాస్ రావు, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments