గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన గుర్తు తెలియని 2 అనాధ శవాలకి నేడు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 1వ ఠాణా పోలిస్ సిబ్బంది మరియు కామారెడ్డి పోలిస్ సిబ్బంది అనుమతితో నేడు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది…
అనారోగ్యంతో మృతిచెందిన ఈ రెండు అనాధ శవాలకి సంబంధించి ఎవరో ఎక్కడివారో తెలియదు ఎలాంటి ఐడేంటిటి లేదు వారి దగ్గర రోడ్లపై నిస్సహాయక స్థితిలో ఉండగా పోలిసులు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు వారి సంబంధికులు ఎవరు రాకపోవటంతో నేడు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆ బాధ్యతను తీసుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించింది
ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.మద్దుకూరి సాయిబాబు కోశాధికారి జయదేవ్ వ్యాస్, నరేష్ రెడ్డి, 1వ ఠాణా పోలిస్ సిబ్బంది రాజ్ గోపాల్, కామారెడ్డి పోలిస్ సిబ్బంది విజయ్ తదితరులు పాల్గొన్నారు
