జాతీయ పసుపు బోర్డు సభ్యులను ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఇండస్ట్రీ సభ్యులు సన్మానించారు. ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులు తమ అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో నిఖిసాయి హోటల్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ సమాహారంలో పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నుకోబడిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో పాటు నిజామాబాదు శాసన సభ్యులు దనపాల్ సూర్యనారాయణ మరియు ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డిని సన్మానించి అభినందనలు తెలియచేసారు..
అదే విధంగా జాతీయ పసుపు బోర్డు సెక్రెటరీ శ్రీమతి హేమలత ని కలిసి నిజామాబాదు వర్తకుల సమస్యలు మరియు ఇండస్ట్రియల్ కారిడార్ అవసరాన్ని తెలియచేయగా సానుకూలంగా స్పందించారు.
నిజామాబాదు పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానానని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జగదీశ్వర్ రావు, కార్యదర్శి కమల్ ఇనాని, సభ్యులు శ్రీనివాస్ రావు, మాస్టర్ శంకర్, రమేష్ గుప్తా, దర్శన్ సింగ్ గార్లు పాల్గొన్నారు.
